వందే భారత్.. నరసాపురం వరకు పొడిగింపు
WG: జిల్లాలో మొట్ట మొదటిగా వందే భారత్ రైలు నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 12నుంచి నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 20677 రైలు చెన్నై నుంచి జనవరి 12న 5.30 బయలుదేరి 14కి నరసాపురం చేరుతుంది. తిరిగి అదే రోజు నరసాపురంలో 14.50 బయలుదేరి 23.45కు చెన్నై చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.