'GHMCలో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం'
HYD: జీహెచ్ఎంసీలో పలు మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఈ విలీనం అశాస్త్రీయంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆరోపించారు. మున్సిపాలిటీల విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.