బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి చేయూత
SDPT: చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన పిండి వినిత ములుగులోని RVM మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వినిత విద్యాభ్యాసానికి చేయూతగా గ్రామానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు.