VIDEO: సత్తెనపల్లిలో గాయపడిన జింక
పల్నాడు జిల్లా సత్తెనపల్లి 19వ వార్డు సుందరయ్య కాలనీలోని ఇవాళ తెల్లవారుజామున జనావాసాల మధ్య చుక్కల జింక ప్రత్యక్షమైంది. తలపై గాయాలతో కదలలేని స్థితిలో స్థానికులకు కనిపించింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి జింకను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు.