పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

కోనసీమ: ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముద్ర యోజన రుణ కల్పన పథకం కింద చిన్న వ్యాపారాలకు పూచికత్తులేని ఆర్థిక సహాయం పొంది జీవనోపాదులు మెరుగుపరుచుకోవాలని సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు.