బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్సై

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎస్సై

మహబూబాబాద్ జిల్లా కురవి ఎస్సై గండ్రాతి సతీష్ ఓ నిరుపేద కుటుంబానికి గురువారం ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి మండలం మల్యాల గ్రామానికి చెందిన నీలమ్మ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. విచారణ నిమిత్తం నీలమ్మ ఇంటికి వెళ్లిన ఎస్సై వారి ఆర్థిక పరిస్థితి చూసి ఆర్థికంగా చేయూతనందించారు.