'నరసాపురంలో 100 శాతం విద్యుత్ పునరుద్ధరణ'

'నరసాపురంలో 100 శాతం విద్యుత్ పునరుద్ధరణ'

W.G: నరసాపురం నియోజకవర్గ పరిధిలో 100 శాతం విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు విద్యుత్ శాఖ ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. ఈ పనుల కోసం 40 స్తంభాలు, ఆరు కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి 150 మంది సిబ్బందిని రప్పించామని చెప్పారు. వీరు నిరంతరం పనిచేసి మరమ్మతులు చేపట్టి విద్యుత్ అంతరాయం లేకుండా చేశామన్నారు.