కేడర్‌కు ఎమ్మెల్యే వేగేశన కీలక పిలుపు

కేడర్‌కు ఎమ్మెల్యే వేగేశన కీలక పిలుపు

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రేపు బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ పసుపు చొక్కాలు ధరించి బాపట్ల పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. మండల అధ్యక్షులు ఈ వేడుకలను పర్యవేక్షించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.