మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేత
NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మైనార్టీ కుటుంబాలకు విద్యార్థులు షేక్ సుభాని, షేక్ నఫీసా, షేక్ ఫరహా సుల్తానాలకు పీ-4 పథకంలో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు బోండా సిద్ధార్థ రూ.36,000/ఆర్థిక సాయాన్ని నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.