ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

వనపర్తి: భారతదేశంలో అన్ని మతాలు, కులాల ప్రజలు ఐకమత్యంతో జీవిస్తున్నారని వనపర్తి ప్రజాసంబంధాల అధికారి సీతారాం నాయక్ అన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వనపర్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు.