మద్యం మత్తులో డ్రైవర్.. రైతులకు యూరియా అందజేసిన పోలీసులు

మద్యం మత్తులో డ్రైవర్.. రైతులకు యూరియా అందజేసిన పోలీసులు

MHBD: కేసముద్రం(M) కల్వల గ్రామంలో యూరియా కోసం వేచి ఉన్న రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ఇవాళ కానిస్టేబుల్ అలీమ్ స్వయంగా లారీ డ్రైవర్‌గా మారారు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ స్థానంలో బాధ్యతలు స్వీకరించి, యూరియా లోడుతో ఉన్న లారీని నేరుగా గ్రామానికి చేర్చారు. రైతుల కష్టాలను చూసి చలించిపోయిన అలీమ్ చర్యను SP సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రశంసించారు.