VIDEO: డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ నేత
ATP: రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి గుంతకల్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఆఫీస్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తరలింపు విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.