పైగా ప్యాలెస్‌లో HMDA కార్యకలాపాలు
HYD మహానగరాభివృద్ధి సంస్థ కార్యాలయం తరలింపు ప్రక్రియ షురూ కానుంది. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లోకి మార్చనున్నారు. ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా ఈ ప్యాలెస్‌లో HMDA కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం దీనిని పరిశీలించారు. అన్ని విభాగాలు అక్కడే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.