చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ATP: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాలలో గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.