'ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు'

'ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు'

NDL: రాష్ట్రంలో రైతులకు యూరియా అందజేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని సోమవారం నిరసన చేపట్టారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు లేక పంట నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఉల్లి, టమాటాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు.