VIDEO: విజయవాడలో వైసీపీ నేతలు ఫైర్

NTR: విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల అధికారిని కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలను “మీరెవరో మాకు తెలియదు” అంటూ అధికారులు స్పందించడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, దేవా భక్తుని చక్రవర్తి అధికారుల తీరును తీవ్రంగా విమర్శించారు.