VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలం రామాపురం గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలతో కలిసి ప్రజల సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.