కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు సర్పంచులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు సర్పంచులు

KNR: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం బూర్నూర్, లోహార, లింగుగూడ గ్రామ పంచాయతీల సర్పంచులు ఆత్రం గంగారాం, వసంత్ రావు, మానిక్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.