నీటి శుద్ధి యంత్రాలు మూత..!
కోనసీమ: మండపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు-నేడు పథకం కింద ఏర్పాటు చేసిన 115 నీటి శుద్ధి యంత్రాల్లో 59 ప్లాంట్లు పనిచేయడం లేదు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటి నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.