ప్రతిభ చాటిన పీఆర్వోను అభినందించిన ఎస్పీ

ప్రతిభ చాటిన పీఆర్వోను అభినందించిన ఎస్పీ

WNP: పీఆర్వోల శిక్షణ శిబిరంలో జిల్లాకు చెందిన పీఆర్వో ఎస్.రాజ గౌడ్ అద్భుత ప్రతిభ చాటి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పీఆర్వో రాజా గౌడ్‌ను అభినందించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పీఆర్వో ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలు కావాలని అన్నారు.