వైభవంగా శ్రీ ఎండల మల్లికార్జున స్వామి పున: ప్రతిష్ఠ

శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆగమశాస్త్ర వేద పండితులు పుణ్యాహవాచనం విగ్నేశ్వర పూజ అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ స్పోర్ట్స్ మెంట్ ఓఎస్డీ కింజరాపు ప్రభాకర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.