14 మంది మృతి.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

14 మంది మృతి.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రధాని వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, ఇవాళ ఉదయం టిప్పర్-ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో 14 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.