లక్ష ఎకరాల్లో కాఫీ సాగు లక్ష్యం

లక్ష ఎకరాల్లో కాఫీ సాగు లక్ష్యం

ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఎ పరిధిలో లక్ష ఎకరాల విస్తీర్ణంలో కాఫీ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా కొన్ని వేల ఎకరాల చొప్పున ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నారు. కాఫీ విత్తనాలను ప్రభుత్వమే ఉచితంగా అందించనుంది. మిరియాలు అంతర పంటగా సాగుచేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.