'ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి'
BPT: పర్చూరు నియోజకవర్గం ఉప్పుటూరులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ హోమియో వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పర్యావరణ హితమే మనకు రక్ష అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పారిశుధ్యంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.