గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

VZM: గంట్యాడ మండలంలోని కొండ తామరపల్లి జంక్షన్‌లో గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ గురువారం పట్టుకున్నారు. బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన బండారు రాము అనే వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో మోటువేసి పట్టుకున్నారు. అతని వద్ద నుండి 1300 గ్రాములు గంజాయిని సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.