VIDEO: ఘనంగా మొదటి కార్తిక సోమవారం పూజలు

VIDEO: ఘనంగా మొదటి కార్తిక సోమవారం పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శ్రీఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే దేవాలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.