ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.