అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO
KDP: జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం RDO కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణీ సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.