VIDEO: విద్యుత్ ఆర్టిజన్ల నిరసన.. విధుల బహిష్కరణ

VIDEO: విద్యుత్ ఆర్టిజన్ల నిరసన.. విధుల బహిష్కరణ

JN: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు విధుల బహిష్కరణ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పదోన్నతులు, ప్రయోజనాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రం చేస్తాం.