వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
HYD: వనస్థలిపురం స్నేహపురి కాలనీలో పోలీసుల అప్రమత్తత ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. 6వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకునేందుకు ఓ వ్యక్తి యత్నిస్తున్నట్లు PSకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తొలుత అతడికి నచ్చజెప్పిన పోలీసులు ఎంతకీ వినకపోవడంతో ఫైర్ సిబ్బంది సాయంతో ఎట్టకేలకు కిందకు తీసుకొచ్చారు.