షాపులోకి దూసుకుపోయిన కారు
CTR: బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కారు శనివారం షాపుల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని దుకాణదారులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.