పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
E.G: కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం పశువైద్య ఆసుపత్రి దగ్గర పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ పీ.విశ్వం తెలిపారు. వీరి నుంచి రూ.9,800ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై అలెగ్జాండర్, ఇతర సిబ్బంది నిందితులను పట్టుకున్నారన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగితే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.