ఊట గెడ్డలే ఆధారం.. తూటంగి గ్రామంలో నీటి సంక్షోభం
ASR: డుంబ్రిగూడ(M) తూటంగిలో గిరిజనులు తీవ్రమైన తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రావిటీ నీటి పథకం నిర్లక్ష్యంతో పనికిరాకపోవడంతో గ్రామానికి స్థిరమైన నీటి వనరు లేకుండా పోయింది. దీంతో గ్రామస్థులు సమీపంలోని ఊట గెడ్డలు, చిన్న ప్రవాహాలపై ఆధారపడుతున్నారు. కలుషిత నీరు వినియోగించడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.