స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు వాయిదా

VSP: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ఈ నెల 16కి బదులు 23వ తేదీన నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. వివిధ వేడుకలు, పండగల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.