నిమ్స్‌లో ప్రపంచ నర్సుల దినోత్సవం

HYD: సమాజంలో నర్సుల పాత్ర కీలకమైనదని, వారి సేవలు వెలకట్టలేనివని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అన్నారు. సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. బీరప్ప కేక్ కట్ చేసి నర్సులకు, నర్సింగ్ విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు సీనియర్ నర్సులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.