బాలయ్య కుమారుడి ఎంట్రీ అప్పుడే..!!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. కానీ ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఓ లవ్ స్టోరీతో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడని.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా లాంచింగ్ ఉంటుందని హీరో నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.