నలుగురు గంజాయి నిందితులకు పదేళ్ల శిక్ష
AKP: గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదు చేసిన కేసులో నేరం రుజువు కావడంతో చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరినారాయణ పైవిధంగా తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధించినట్లు తెలిపారు.