'పగిలిన మిషన్ భగీరథ పైపులైన్.. నీళ్ల కోసం ఇబ్బందులు'

VKB: దుద్యాల్ మండలంలోని ఆలేడ్, హస్నాబాద్ గ్రామాల్లో 5 రోజులుగా మిషన్ భగీరథ నీటిసరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హస్నాబాద్ సమీపంలో పైపులైన్ పగిలిపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీంతో తాత్కాలికంగానైనా ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు బోరు, బావుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.