అన్నమయ్య జిల్లాలో పరేడ్ రిహార్సల్స్

అన్నమయ్య జిల్లాలో పరేడ్ రిహార్సల్స్

అన్నమయ్య: జిల్లా కేంద్రం మదనపల్లిలో తొలిసారిగా నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీటీ కళాశాల మైదానంలో జరిగిన తుది పరేడ్ రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్, జేసీ శివ నారాయణ శర్మ పరిశీలించారు. పోలీసుల విన్యాసాలు, గుర్రపు స్వారీ, డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి.