బెయిల్ మంజూరు చేయడంపై ప్రజాసంఘాల ఆగ్రహం

బెయిల్ మంజూరు చేయడంపై ప్రజాసంఘాల ఆగ్రహం

కోనసీమ జిల్లాలోని బాణాపురంకు చెందిన ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన రాయపరెడ్డి బాబి అనే వ్యక్తికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీని పట్ల అమలాపురంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద వారు సోమవారం నిరసన చేపట్టారు. నిందితుడైన బాబి విడుదల కావడంతో బాలిక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.