'యువత దేశ సేవకు ముందుకు రావాలి'
NRML: యువత దేశ సేవకు ముందుకు రావాలని మాజీ కౌన్సిలర్ ఎడిపల్లి నరేందర్ అన్నారు. నిర్మల్లోని బెస్తవారిపేట కాలనీకి చెందిన గంగోని రాకేష్ విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకుని సోమవారం పట్టణానికి వచ్చాడు. అతడికి కాలనీవాసులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు.