ఆహార భద్రత ప్రమాణాలపై GHMC దృష్టి
HYD: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు పెంచేందుకు GHMC దృష్టి పెట్టింది. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో GHMCలోని ఆహార భద్రతాధికారులు పిల్లలను ఆకట్టుకునే చిరుతిళ్ల నమూనాలను సేకరించినట్లు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ లైసెన్సు లేకుండా, నాసిరకం వస్తువులతో తయారు చేసే రసగుల్లాలు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తి రాజు తెలిపారు.