జిల్లాలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
SDPT: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 10 మండలాల్లో ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడతలో మొత్తం 2,49,882 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 172 సర్పంచ్ స్థానాలకు, 1,371 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,644 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.