రేపు జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు
PPM: జిల్లా కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి 'ఇఫ్తార్ విందు' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖా అధికారి శ్రీ షైక్ మహబూబ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.