పాక్ ఎయిర్‌లైన్స్ అమ్మకం.. కొనేందుకు ఆర్మీ రెడీ!
అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్.. చివరకు తమ జాతీయ విమానయాన సంస్థ (PIA)ను అమ్మకానికి పెట్టింది. IMF కండిషన్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న బిడ్డింగ్ జరగనుండగా.. దీన్ని కొనడానికి పాక్ ఆర్మీకి చెందిన 'ఫౌజీ ఫర్టిలైజర్' కంపెనీ బిడ్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్. 20 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలో మొత్తం నలుగురు బిడ్డర్లు రేసులో ఉన్నారు.