వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం
SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తి పరవశంతో జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నాదం, “గోవింద గోవింద” నామస్మరణల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణం భక్తులకు కనుల విందుగా నిలిచింది.