'సమిత్వ సర్వే'లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: MPDO

VZM: ప్రతీ ఇంటికి వెళ్లి 'సమిత్వ సర్వే' చేపట్డాలని బొబ్బిలి MPDO పి. రవికుమార్ సూచించారు. బుధవారం స్థానిక కలవరాయిలో ఆయన సమిత్వ సర్వేను పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి కొలతలు వేసి సర్వే చేయాలని, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. సర్వేలో తప్పులు లేకుండా చూడాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.