ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం పరిశీలించిన కలెక్టర్

NRPT: మద్దూరు మండల కేంద్రానికి సమీపంలో ప్రతిపాదిత ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం పరిశీలించారు. స్థల పరిస్థితులు, రహదారి సౌకర్యం, పరిసర వాతావరణం వంటి అంశాలను ఆమె సమీక్షించి, కళాశాల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.