గాజువాక సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

VSP: గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ. మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.