'కూటమి ప్రభుత్వ హామీల అమలుకు కృషి చేయండి'

KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేయాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి యూటీఎఫ్ కడప జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. సోమవారం యూటీఎఫ్ నేతలు పులివెందులలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఆయన గృహంలో కలిసి విద్యారంగం, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.